Site icon Prime9

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మకు నోటీసులు – హైదరాబాద్‌ బయలుదేరిన ఏపీ పోలీసులు

Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్‌లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్‌ వేదికగా వరుసగా ట్వీట్స్‌ చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

ఈ మేరకు విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ నోటీసులు రెడీ చేశారు. వ్యక్తిగతం ఆయనకు నోటీసులు ఇచచేందుకు ఎస్సై శివరామయ్య బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ రోజు ఆర్జీవీకి వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్‌ శ్రీకాంత్‌ మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కూడా కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పోలీసులకు పోసానిపై జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

2021 సెప్టెంబర్‌ 28న, 2024 ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌లోని ప్రెస్‌క్షబ్‌లో పోసాని మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శ వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ సెంట్రల్‌ ఆంద్రాజోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోలను వైసీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని తీస్తోందని తెలిపారు. ఈ విషయమై పోసాని, వైసీపీ నాయకులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు పోసానితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.

Exit mobile version