Site icon Prime9

Tollywood : టాలీవుడ్‌కి కూడా తప్పని ఏపి సర్కారు రూల్స్… చిరు, బాలయ్య సినిమా ఈవెంట్స్‌కి ఎర్ర జెండా?

ap government go1 effect on tollywood movies pre release events

ap government go1 effect on tollywood movies pre release events

Tollywood : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీటి ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా పడుతుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటనల నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనల్లో నెల్లూరులో 8 మంది, గుంటూరు లో 3 మృతి చెందారు. దీంతో ప్రభుత్వం తొక్కిసలాటల దృష్ట్యా, ఎవైనా పార్టీలు, సంస్థలు, వ్యక్తులు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌ షోల విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ జీవో1 ను అమలు లోకి తెచ్చింది. దీంతో బుధవారం చంద్రబాబు కుప్పం పర్యటనలో రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఇప్పుడు ఎఫెఏక్ట్ టాలీవుడ్ పై కూడా పడిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

కాగా సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి” సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహా రెడ్డి’ మూవీలో బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్ని అలరించగా.. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదికపై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న చిత్ర బృందం.. ఈవెంట్‌కి వచ్చే అభిమానులు, అతిథుల వాహనాల పార్కింగ్ స్థలం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయింది. దాంతో వేదికని మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి సినిమా పరి రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగనుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ జీవో దృష్ట్యా సినిమా జనవరి 6వ తేదీన ఒంగోలులో జరగాల్సిన బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి, విశాఖపట్టణంలో నిర్వహించనున్న చిరంజివి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లపై పడనుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే ఒంగోలులో ముందుగా నిర్వహించిన స్థలంలో అనుమతి నిరాకరించారని, వేరే స్థలంలో పెట్టుకోవాలని పోలీసులు సూచించారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ తరుణంలోనే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మూవీ ఈవెంట్లపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. స్థానిక పోలీసు అధికారులు ఈవెంట్ల నిర్వహణ అనుమతికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారన్నారు.

Exit mobile version