Anchor Vishnu Priya: ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు. ఈ విషయాన్ని విష్ణు ప్రిమ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా
తెలియజేసింది.
ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న ఫొటో ను షేర్ చేసిన ఆమె ‘ మై డియర్ అమ్మా.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు.
నా చివరి శ్వాస వరకు నీతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం.. బలహీనత కూడా. ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలో నవ్వు ఉంటావు.
ఈ ప్రపంచంలో నాకు మంచి జీవితాన్ని అందించడం కోసం నువ్వు ఎలా ఇబ్బందులు పడ్డావో తెలుసు. దానికి ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను.
ప్రస్తుతం నువ్వు అనంత విశ్వంలో కలిసిపోయావు. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అమ్మా’ అంటూ తన అమ్మ తో ఉన్న అనుబంధాన్నివిష్ణు ప్రియ
(Anchor Vishnu Priya )పంచుకుంది.
విష్ణు ప్రియ తల్లి మృతి పట్ల పలువురు బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఇటీవల బుల్లితెర కు చెందిన మరో నటి రీతూ చౌదరి తండ్రి కూడా హఠాన్మరణం చెందారు. విష్ణుప్రియ, రీతూ వర్మ మంచి ఫ్రెండ్స్.
అయితే ఇద్దరి కుటుంబాల్లో వరుసుగా విషాదాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో యూట్యాబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ(Anchor Vishnu Priya కు ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత అనేక బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా అలరించింది. ఇటీవల వాంటెడ్ పండుగాడు తో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తుదిశ్వాస విడిచిన అలనాటి నటి
మరోవైపు టాలీవుడ్ లో శుక్రవారం వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. అలనాటి సీనియర్ నటి జమున కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ బాషల్లో ఆమె అనేక చిత్రాల్లో నటించారు.
సత్యభామ లాంటి గడుసైన పాత్రలు చేయడంలో జమున కు సాటి ఎవరూ లేరు. ఎ
న్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, , కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి సినీ ప్రియులను మెప్పించారు.
నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున తనదైన ముద్ర వేశారు.
1989 లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుంచి లోక్ సభకు ఆమె ఎన్నికయ్యారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/