Site icon Prime9

Amithabh Bachchan : షూటింగ్ కోసం లిఫ్ట్ అడిగి బైక్ పై వెళ్ళిన అమితాబ్ బచ్చన్.. వైరల్ గా మారిన పోస్ట్

amithabh bachchan goes to shooting by asking lift from stranger

amithabh bachchan goes to shooting by asking lift from stranger

Amithabh Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుపరిచితులే. తదైన శైలిలో దూసుకుపోతూ 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఫుల్ యాక్టీవ్ గా సినిమాలు, షోలు చేస్తున్నారు బిగ్ బీ. ఈ ఏజ్ లో కూడా రెస్ట్ అనే పదం లేకుండా రోజూ షూట్స్ కి వెళ్తున్నారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అమితాబ్ ది అని మన అందరికి తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ చేసిన ఓ పనికి అంతా ఆశ్చర్యపోయి అభినందిస్తున్నారు.

అమితాబ్ ఇటీవల షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొంతమంది దీన్ని ఫొటో తీసి వైరల్ చేయగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమితాబ్ బైక్ మీద వెళ్తున్న ఫోటోని షేర్ చేసి.. రైడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ బడ్డీ. నీకు తెలియదు, కానీ నువ్వు నన్ను నా వర్క్ ప్లేస్ కి సరైన సమయానికి చేర్చావు. త్వరగా పరిష్కారం కానీ ఈ ట్రాఫిక్ జామ్ నుంచి నన్ను కాపాడారు. క్యాప్, షార్ట్, ఎల్లో షర్ట్ వేసుకున్న నీకు చాలా థ్యాంక్స్ అని తెలిపారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంతటి సూపర్ స్టార్ టైంకి వర్క్ కి వెళ్లాలని కార్ ని వదిలేసి లిఫ్ట్ అడిగి వెళ్లారంటే చాలా గ్రేట్ అని.. ఆయన దగ్గర్నుంచి మనం చాలా నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్. అయితే ఇటీవల అమితాబ్ బచ్చన్ కు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుపుకుంతున్నప్పుడు అనుకోని రీతిలో గాయాలయ్యాయి. మళ్ళీ గ్యాప్ తీసుకొని అమితాబ్ ఇప్పుడు వరుసగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

Exit mobile version