Site icon Prime9

Ambati Rambabu : చంద్రబాబు పిచ్చి కుక్కలా అరుస్తున్నాడన్న అంబటి రాంబాబు

ambati rambabu shocking comments on chandrababu over kuppam issue

ambati rambabu shocking comments on chandrababu over kuppam issue

Ambati Rambabu : కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పిచ్చి కుక్కలా చంద్రబాబు అరుస్తున్నాడు అని ఆయన అన్నారు. చంద్రబాబు ని తిరగనియ్యకుండా ఈ జీ.వో తీసుకొచ్చారు అనే వాదనని ఖండిస్తూ.. వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఏమి కాలేదే! చంద్రబాబు తిరిగినా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల్లో అన్నీ ఓడిపోయారే అని ఆయన ప్రశ్నించారు.

కందుకూరు, గుంటూరు లో మరణాల నుండి ద్రుష్టి మరల్చడానికే చంద్రబాబు కుప్పంలో అలా ప్రవర్తించారు అని అన్నారు అంబటి. పదే పదే చంద్రబాబు కుప్పానికి వెళ్ళడానికి కారణం అక్కడ ఆయన ఓడిపోబోతున్నారు అనే భయమే అని అన్నారు. కుప్పం లో ప్రజలు కూడా జగన్ మోహనరెడ్డి తోనే ఉన్నారని అని, చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ శని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో 29 చనిపోయిన ఘటనని అంబటి ఉదహరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి కూడా కౌంటర్ ఇచ్చారు. గతం లో పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి కి ఇలాంటి నిభందనలు పెడితే పాదయాత్ర ఎలా చేసేవారు అని పవన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పాదయాత్రలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఈ జీ.వొ. ప్రతిపక్షాలకు కాదు అధికార వైసీపీ కి వర్తిస్తుంది అని అన్నారు అంబటి.

Exit mobile version