Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించే అంబటి.. తన మార్క్latest news రాజకీయాలతో దూసుకుపోతున్న ఈ నేతలు సంక్రాంతికి మాత్రం అసలు ఆపలేకపోతున్నాం.
స్టెప్పులతో ఇరగదీసిన అంబటి
ప్రతి సంక్రాంతికీ పెద్ద స్టార్ ల సినిమాలు పోటీ పడుతుండడం ఎంత ఖాయమో.. ఏపీ మంత్రి అంబటి స్టెప్పులేయడం కూడా పక్కా అనేలా చెలరేగుతున్నారు.
సంక్రాంతి పండగంటే చాలు.. అంబటి రాంబాబుకు కొత్త జోష్ వచ్చేస్తుంది. ఈ ఏడాది కూడా అంబటి రాంబాబు పండగ హంగామా అంబరాన్నంటింది.
స్టెప్పుల్లో తగ్గేదే లే అనే విధంగా ఫుల్ జోష్ తో దుమ్ము లేపారు అంబటి. ఆ ఊపు ఆ రూపు.. ఈ పండగ స్పెషల్ నేనే అనే రేంజ్ లో అదరగొట్టార
ఈ సంక్రాంతి హీరో నేనే అంటూ తెరమీదకు దూసుకొచ్చేశారు.
ఆ డ్యాన్స్ లోనూ కావల్సినంత వైబ్రేషన్, ఏది ఏమైనా ఇప్పటి వరకూ చూస్తే ఈ సంక్రాంతి బెస్ట్ పెర్ఫామర్స్ అవార్డ్ అంబటి రాంబాబుకి అనేలా సూపర్ అనిపిస్తున్నారు.
భోగి పండుగను పురస్కరించుకొని సత్తెనపల్లిలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన భోగి మంతల దగ్గర అందరితో కలిసి అంబటి రాంబాబు డాన్స్ చేశారు.
ముఖ్యంగా ఆయన వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ గ్రెస్, ఆ ఊపు.. ఓహో.. తనలోని నాట్య కళను మొత్తం బయట పెట్టేశారు అంబటి.
గతేడాది కూడా భోగి పండుగకు చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇచ్చిన రాంబాబు(Ambati Rambabu).. ఈ సారి మాత్రం చెలరేగి దుమ్ములేపారు.
ప్రస్తుతం అంబటి రాంబాబు డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ పై అంబటి కౌంటర్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
అందుకు కౌంటర్ గా అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ నైతికత ఏంటి నీ నైతికత ఏంటి.. ఓట్లు పొందే హక్కు, అర్హత మీకు లేదు.
ప్రతి ఒక్కరూ వచ్చి థూ అని ఊసి పోతున్నారు. అమ్ముడుపోవటం, ప్యాకేజ్ తీసుకోవటమనే తాపత్రయం మీది. ఛీడ పురుగులు మీరు.. మీకు భవిష్యత్తు లేదు అని విమర్శించారు.
రాజకీయాల్లో పవన్ కామెడీ పీస్ అని ప్రజలకు అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు.. మంత్రులను దూషిస్తాడు. పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/