Site icon Prime9

Allu Arjun: చిరంజీవిని కలిసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిన అల్లు అర్జున్‌

Allu Arjun Meets Chiranjeevi With Family: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబంతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కాసేపటి క్రితం భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి కారులో చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అలాగే బన్నీతో అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. కాగా సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తర్వాత చిరంజీవి సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

అలాగే నాగబాబు కూడా వెళ్లారు. ఇక జైలు నుంచి విడుదలై ఇంటికి రాగానే చిరంజీవి సతీమణి సురేఖ వెళ్లారు. మేనల్లుడిని హత్తుకుని ఆమె ఎమోషనల్‌ అయ్యారు. ఇదిలా ఉంటే నేడు(డిసెంబర్‌ 15) బన్నీ కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి లంచ్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న దూరం చెరిగిపోయేలా కనిపిస్తోంది. కాగా సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ని డిసెంబర్‌ 13న చిక్కపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న బన్నీని ముందస్తు సమాచారం లేకుండా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా.. బన్నీకి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు అల్లు అర్జున్‌ పటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా ఆయన తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు. సాయంత్ర నాలుగు గంటలను అల్లు అర్జున్‌ క్వాష్‌ పటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. కానీ తదుపరి ఫార్మాలిటిస్‌ పూర్తి కావడానికి సమయం పట్టడంతో బన్నీ రాత్రి జైలులోనే ఉన్నాడు. మరుసటి రోజు తెల్లవారు జామున జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాడు. దీంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం బన్నీ నివాసాని కదిలి వచ్చిన ఆయనను పలకరించింది.

Exit mobile version