Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తుంది.
ఈ చిత్రం ఆ మధ్య గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది.
రెగ్యూలర్ షూటింగ్‌కి కొంత సమయం పడుతుందని సమాచారం.
ఈ చిత్రం విజయ్ నటించిన `తెరి`కి రీమేక్‌గా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ సినిమా లోని పాయింట్ కి.. హరీష్ శంకర్ రాసుకున్న `భవదీయుడు భగత్ సింగ్` కథని కలిపి తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతుంది.
కాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదరిపోయే వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీలో అల్లు అర్హ..
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె సమంత మెయిన్ రోల్‌లో నటించిన `శాకుంతలం` చిత్రంలో బాల నటిగా నటిస్తుంది.
ఇందులో బాల భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తుండటం విశేషం.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా అందులో సింహం మీద కూర్చొని అర్హ రావడం అందరికీ బాగా నచ్చేసింది.
అలానే ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ని అర్హ చెబుతున్న ఫోటోని అల్లు స్నేహ రెడ్డి షేర్ చేయడం.. డానికి అల్లు అర్జున్ కామెంట్ చేసి మురిసిపోవడం కొద్ది రోజుల క్రితం వైరల్ గా మారింది.
ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీలో క్యారెక్టర్ కోసం అంటే మెగా, అల్లు ఫ్యామిలీల అభిమనులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
అయితే తేరి సినిమాలోని పాప, మహిళలకు సంబంధించిన సెంటిమెంట్ అంశాలను.. భవదీయుడులోని పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని మిక్స్ చేసి `ఉస్తాద్ భగత్ సింగ్`గా హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తుంది.
అయితే తేరి సినిమాలో కథ ప్రకారం విజయ్, సమంతకి ఓ పాప ఉంటుంది.
అందులో ఆ పాపగా నటి మీనా కూతురు నటించింది.
అందుకు గాను మరి తెలుగులో పవన్‌కి కూతురుగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏఈ వార్త బయటికి రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అందుకు గాను బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
పవన్ సినిమాలలో బాలనటిగా, పైగా ఆయన కూతురిగా అంటే ఎంతటి పేరొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాలనటిగానే స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక అర్హ ఇప్పటికే చాలా ఫేమస్ .. ఇక దీంతో అర్హ బాలనటిగా స్టార్ అయిపోతుంది అని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/