Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అభిమానులు “బ్రో” సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. కాసేపట్లో మూవీ పూర్తి రివ్యూ కూడా రానుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు వన్ మ్యాన్ షోగా థియేటర్లు దద్దరిల్లుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ‘బ్రో’ చిత్రం చూసేందుకు సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ‘జూనియర్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Bro Movie : పవన్ కళ్యాణ్ “బ్రో” మూవీ చూడడానికి వచ్చిన “అఖిరా నందన్”..

akhira nandan coming to watch pawan kalyan Bro Movie