Site icon Prime9

Agent Trailer: ఆకలితో ఉన్న పులి వేటాడడానికి వస్తోంది.. యాక్షన్ సీన్స్‌లో ఇరగదీసిన అఖిల్

agent

agent

Agent Trailer: అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

స్టైలిష్‌గా ట్రైలర్‌ Agent Trailer

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అఖిల్ నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఏజెంట్. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథని అందించాడు.

ఈ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ రావడం పక్కా అని అభిమానులు అనుకుంటున్నారు.

గతంలో వంశీ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు విజయవంతమయ్యాయి.

దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అండ్ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతకాలు పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ఇస్తున్నాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

ఇటీవలే మూవీ ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచారు మూవీ మేకర్స్.

ఈ క్రమంలోనే నేడు మూవీ ట్రైలర్ ని.. కాకినాడ మెక్ లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.

Exit mobile version