Site icon Prime9

Actress Tapsee : పెళ్లి గురించి అడిగిన అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన తాప్సీ..

Actress Tapsee shocking reply about marriage to fan

Actress Tapsee shocking reply about marriage to fan

Actress Tapsee : తెలుగు తెరకు “ఝుమ్మంది నాదం” సినిమాతో పరిచయం అయ్యింది నటి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. అయితే తెలుగులో ఈమె నటించిన సినిమాలలో ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ మాత్రమే హిట్ సాధించింది. తాప్పీ తెలుగులో తక్కువ సినిమాలే చేస్తున్నప్పటికీ బాలీవుడ్ లో బిజీ గానే ఉంటోంది.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా నెటిజన్లతో ముచ్చటించింది. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి, సినిమాలు, వెకేషన్స్ వంటి విషయాల గురించి ఓపెన్ అయ్యింది. కాగా “మీ పెళ్లి ఎప్పుడు?” అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్న ఇక్కడ హైలెట్ అయ్యింది. అతడి ప్రశ్నకు తాప్సీ అదిరిపోయే సమాధానం చెప్పింది. “నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక వేళ చేసుకుంటే తప్పకుండా చెప్తాను” అని ఆన్సర్ చెప్పింది.

దీంతో తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ తో తాప్సీ.. ఇన్ డైరెక్ట్ గా ఆలియా భట్‌‌ను టార్గెట్ చేసిందనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి వీరిద్దరూ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు తాప్సీ సమాధానం విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరీ ఇంత బోల్డ్ గా మాట్లాడుతుందేంటి ? అని చర్చించుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

Exit mobile version