Site icon Prime9

Actress Hansika : టాలీవుడ్ హీరో వేధించాడు అనే వార్తలపై స్పందించిన హన్సిక.. వాళ్ళపై ఫైర్

actress hansika shocking comments on fake news

actress hansika shocking comments on fake news

Actress Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం ఈ ముద్దుగుమ్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన హన్సిక ..  డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “దేశ ముదురు” సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ నటించిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ ఆపిల్ బ్యూటీ.  దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ అందుకున్న ఈ భామ.. తమిళ్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇక ఈ మధ్య కాలంలో హన్సిక తెలుగు సినిమాలకు దూరమయ్యింది. తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది హన్సిక (Actress Hansika). మధ్యలో ఓ మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. గత సంవత్సరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది హన్సిక. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు హన్సిక చేతిలో దాదాపు అరడజను సినిమాలు, కొన్ని సిరీస్ లు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ హీరోల గురించి, హీరోయిన్స్ గురించి, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడింది.

అయితే ఇదే ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ఓ హీరో నన్ను బాగా ఇబ్బందిపెట్టాడు. రోజూ డేట్ కి రమ్మని అడుగుతూ, డేట్ కి వస్తావా అంటూ ఫోన్స్, మెసేజ్ లతో విసిగించాడు. అయితే ఆ హీరోకి మాత్రం తగిన బుద్ధి చెప్పాను. మళ్ళీ ఇప్పటిదాకా నా జోలికి రాలేదు అని కామెంట్స్ చేసింది అంటూ పుకార్లు వచ్చాయి. దీంతో ఆ హీరో ఎవరు అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు.  అయితే ఇవన్నీ తప్పుడు వార్తలు అని.. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని సోషల్ మీడియా వేదికగా కళారతి ఇచ్చింది హన్సిక. దాంతో ఈ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయ్యిందని అందరూ భావిస్తున్నారు. అలానే హన్సిక చేసిన ట్వీట్ లో అలాంటి వార్తలను రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని రాసుకొచ్చింది.

 

 

తెలుగు లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్, ప్రభాస్, నితిన్, మంచు విష్ణు, రవితేజ.. ఇలా అనేకమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది హన్సిక.

Exit mobile version