Site icon Prime9

Thalapathy Vijay : ప్రముఖ కమెడియన్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన దళపతి విజయ్..!

actor-thalapathy-vijay-surprise-gift-to-comedian-yogibabu

actor-thalapathy-vijay-surprise-gift-to-comedian-yogibabu

Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి ” విజయ్ ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ” వారసుడు ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలి ఉన్నాయని సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా చేస్తుండగా… ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా కమెడియన్ యోగిబాబుకు విజయ్ గిఫ్ట్ పంపించాడు.

స్వతహాగా యోగిబాబుకు క్రికెట్ అంటే ఇష్టమని తెలుసుకున్న విజయ్ ఆయనకు క్రికెట్ కిట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు యోగిబాబు. విజయ్ తో కలిసి యోగిబాబు విజిల్ అనే సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Exit mobile version