Actor Brahmaji : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా – జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకు కౌంటర్ గా వైకాపా నేతలంతా ఒకరితర్వాత మరొకరు పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాగా మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు గురించి అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే పంచ్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బ్రహ్మాజీ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ థాంక్స్ చెబుతున్నారు.
ఇంతకీ రోజా ఏమన్నారంటే…
కాగా ఇటీవల యువశక్తి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రి రోజాపై విమర్శల వర్షం గుప్పించారు.
ఇక ఇదే సభలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాతో సహా వైసీపీ మంత్రులపై తనదైన శైలిలో పంచులు వేశారు.
పవన్ కళ్యాణ్ ను తిట్టడం కోసం ఇక ప్రత్యేక శాఖను పెట్టుకోవాలంటూ మంత్రులకు చురకలంటించారు.
ఆది చేసిన వ్యాఖ్యలకు బదులుగా.. రోజా మాట్లాడుతూ.. మెగా కుటుంబంలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు భయపడి వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ అన్నారు.
చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు.
ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అని భయంతోనే చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్లకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రేమతో మాత్రం కాదు.
నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మా ఎన్నికలలో సపోర్ట్ చేసినప్పుడు.. ఆయన ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి.. ప్రేమ వేరు.. భయం వేరు’ అని రోజా చెప్పుకొచ్చారు.
బ్రహ్మాజీ కౌంటర్..
రోజా చేసిన కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పుడు మెగాభిమానులు, జనసేన అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రి నుంచి మొదటగా బ్రహ్మాజీ ఈ విషయంలో రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతకు ముందు జబర్దస్త్ శీను కూడా డైరెక్టుగా మెగా ఫ్యామిలీపై రోజా వ్యాఖ్యలను తప్పుపట్టాడు.
కేవలం రాజకీయ ప్రాపకం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు.
గతంలో బ్రహ్మాజీ ఒక సినిమా ఫంక్షన్ లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
అన్నయ్య గురించి ఎవరయినా మాట్లాడితే చంపేస్తాం అని అన్నారు. ఇప్పుడు జనసైనికులు అందరూ ఆ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/