Site icon Prime9

Actor Ali: పవన్ కళ్యాణ్ మీదే పోటీ చేస్తా.. జగన్ ఆదేశిస్తే ఏదైనా చేస్తా – అలీ షాకింగ్ స్టేట్‌మెంట్

Actor Ali

Actor Ali

Actor Ali: సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ సంచలన ప్రకటన చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.

జగన్ ఆదేశిస్తే ఏదైనా చేస్తా

తాజాగా తిరుపతి లోని నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2024 లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది.

పవన్ కళ్యాణ్ నాకు మంచి స్నేహితుడు. అయితే సినిమాలు, రాజకీయం రెండూ వేరు.

ఏపీలో 175 సీట్లతో వైసీపీ విజయం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు. పార్టీ ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికైనా సిద్ధం.

సీఎం జగన్ ఆదేశం మేరకు ఎక్కడ నుంచైనా పోటీకి నేను రెడీగా ఉన్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.

అదేవిధంగా నగరిలో మంత్రి రోజా మరోసారి గెలుస్తుందన్నారు. డైమండ్ అంటే చాలా పవర్ ఫుల్ అని ..చాలా విలువైనదన్న అలీ(Actor Ali).. రోజాపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై స్పందించారు.

రోజా కూడా తగ్గేది లేదు.. ఆమె ఓ ఫైర్ బ్రాండ్ అనే విషయం అందరికీ తెలుసన్నారు.

మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీతో మంత్రి రోజాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమని చెప్పారు.

కాగా, ప్రస్తుతం అలీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో అలీ బరిలోకి దిగుతారా? నిజంగా పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు అలీ. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి.

తాజాగా అలీని మీడియా సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు తాను రెఢీ అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ను వదిలారు అలీ.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar