Site icon Prime9

Aaradhya Bachchan : హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్.. ఎందుకంటే ?

aaradhya bachchan filed case on youtube channels about fake news

aaradhya bachchan filed case on youtube channels about fake news

Aaradhya Bachchan : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నారి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈరోజు ఈ కేసు విచారణ హైకోర్టులో జరగనుంది. ఆరాధ్య చేసిన ఫిర్యాదును గమనిస్తే.. 11 ఏళ్ల మైనర్ అయిన తన గురించి, తన ఆరోగ్యం గురించి నిరాధారమైన రూమర్లను యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చేశాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

వాస్తవానికి పలువురు బాలీవుడ్ ప్రముఖుల పిల్లల గురించి నిత్యం ఏదో ఒక రూమర్లు రావడం, వాటిని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రసారం చేయడం నిత్యకృత్యం అయిపోయింది. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, పలువురు గురించి వారు ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇవ్వక ముందే బోలెడు వార్తలు వచ్చాయి. పలువురు ప్రముఖులు పలు సందర్భాల్లో ఓపెన్ గానే సదరు మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. ఈ కోవలోనే ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఆరాధ్యను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఒకానొక దశలో ఈ ట్రోలింగ్స్, వార్తలపై విసుగుపోయిన అభిషేక్ బచ్చన్.. తనను, తన కూతురిని టార్గెట్ చేయడం మానుకోవాలని బాలీవుడ్ మీడియాను కోరారు.

ట్రోల్స్‌ గురించి ‘బాబ్ బిస్వాస్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఈ ట్రోల్స్‌ ఎట్టిపరిస్థితుల్లో అంగీకారయోగ్యం కాదు. ఇలాంటివి చేసేవారిని క్షమించాల్సిన అవసరం కూడా లేదు. నేనొక సినీ నటుడిని అయినంత మాత్రాన ఈ రంగంతో అస్సలు సంబంధం లేని నా కూతురిని టార్గెట్ చేస్తారా. నన్ను ఏమైనా అనాలనుకుంటే నా దగ్గరకు వచ్చి నా మొహం మీద అనండి’ అని అభిషేక్ బచ్చన్ కాస్త ఘాటుగానే అప్పట్లో స్పందించారు. ఇక ఇప్పుడు ఆరాధ్య హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం సీరియస్ అయ్యింది.

ఇదిలా ఉంటే, ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ ఈరోజుతో 16 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. 2007 ఏప్రిల్ 20న అభిషేక్, ఐశ్వర్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఐశ్వర్యరాయ్‌కి మొదట అభిషేక్ బచ్చనే ప్రపోజ్ చేశారట. న్యూయార్క్‌లో ఓ భవంతి బాల్కనీలో తనకు అభిషేక్ ప్రపోజ్ చేశారని గతంలో ఐశ్వర్యరాయ్ చెప్పారు. అభిషేక్ ప్రేమకు తాను పచ్చజెండా ఊపడంతో తమ బంధాన్ని బయటపెట్టామని పేర్కొన్నారు. 2007లోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. అదే ఏడాది పెళ్లిచేసుకున్నారు. 2011 ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఇక రీసెంట్ గా ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోయి .. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ జంట వాటి పట్ల ఏ విధంగా స్పందిస్తారో అని..

Exit mobile version