Site icon Prime9

Pawan Kalyan: దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, హాని కూడా చేస్తాడు.. పవన్ కళ్యాణ్

pawan-kalyan-on--vemana-statue-issue

pawan-kalyan-on--vemana-statue-issue

Andhra Pradesh: యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఒక పత్రికలో దీనిపై వచ్చిన కధనాన్ని పోస్ట్ చేసి వేమన పద్యాల తాత్పర్యాలను ట్వీట్ చేసారు

విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం. విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు. అంతేకాదు హాని కూడా చేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

యూనివర్శిటీ అధికారులు అత్యుత్సాహంతో వేమన విగ్రహాన్ని తొలగించి గేటు పక్కన ఏర్పాటుచేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రాయలసీమ విద్యార్థి సమాఖ్య నాయకులు స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar