Devaragattu: బన్నీ ఉత్సవంలో రక్తం చిందింది.. 60 మందికి గాయాలు

దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో  రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.

Devaragattu: దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో  రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ సమరంలో దాదాపు 60 మంది భక్తులకు గాయాలయ్యాయి కాగా పలువురికి తలలు పగిలాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తాత్కాలిక చికిత్స అందించామని అధికారులు తెలిపారు.
మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా 2 లక్షల మంది ప్రజలు తిలకించారు. కాగా ఈ బన్నీ ఉత్సవాలు చూసేందుకు వచ్చి వీరారెడ్డి (17) అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడు ఆదోని మండలం ఎడ్డవల్లి గ్రామ వాసిగా గుర్తించారు.

ఇదీ చదవండి: దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి.. 15 మంది మృతి