Site icon Prime9

RRR On Oscar: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. 15 కేటగిరీల్లో పోటీ

RRR cinema on Oscar awards

RRR cinema on Oscar awards

RRR On Oscar: ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ షాక్ ఇచ్చిన విషయం విదితమే. కాగా అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పక్కన పెట్టి గుజరాతీ చిత్రం ‘చెల్లో షో'(లాస్ ఫిల్మ్ షో)ని ఇండియా తరఫున పంపారు. జ్యూరీ సభ్యుల ఈ నిర్ణయం ఒకింత సినీ లవర్స్ అందరినీ అసహనానికి గురి చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం నిరాశపడలేదు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించారు.

అమెరికాలో ఆర్ఆర్ఆర్ అనేక రోజుల తరబడి ప్రదర్శించిన విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా యూఎస్లో $ 14 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఆస్కార్ నిబంధల ప్రకారం రెండు వారాలు అమెరికన్ థియేటర్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించబడిన చిత్రంగా జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆర్ఆర్ఆర్ పలు గ్లోబల్ వేదికలపైనా ప్రదర్శించబడింది. దానితో ఆర్ఆర్ఆర్ సినిమా పలు కేటగిరీల్లో నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. మూవీ మేకర్స్ కూడా దీన్ని ధృవీకరించారు. ట్విట్టర్ వేదికగా ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు వెల్లడించారు.

మూవీ మేకర్స్ గ్లోబల్ వేదికపై సినిమా సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ 15 కేటగిరీలో పోటీపడనుందని వెల్లడించారు.
బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట యాక్టర్(ఎన్టీఆర్,రామ్ చరణ్)లతో పాటు పలు విభాగాల్లో పోటీకి ఆర్ఆర్ఆర్ సినిమా పోటీ చేయనుంది. కాగా ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ అవార్డులు గెలిచే అవకాశం ఉందన్న అంచనా లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ హీరోలు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

1. బెస్ట్ మోషన్ పిక్చర్ (డి.వి.వి. దానయ్య),

2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్.ఎస్. రాజమౌళి),

3. బెస్ట్ యాక్టర్ (NT రామారావు(jr), రామ్ చరణ్),

4. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (అజయ్ దేవగన్),

5. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు),

6. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎమ్.ఎమ్. కీరవాణి),

7. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్),

8. బెస్ట్ సౌండ్ (రఘునాధ్ కేమిశెట్టి, బోలోయ్ కుమార్ బోలోయ్, రాహుల్ కర్పే),

9. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే (వి. విజయేంద్రప్రసాద్ (కథ), స్ర్కీన్‌ప్లే (ఎస్.ఎస్. రాజమౌళి), అడిషనల్ డైలాగ్ (సాయిమాధవ్ బుర్రా) ),

10. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రిసెస్ (ఆలియా భట్),

11. బెస్ట్ సినిమాటోగ్రఫీ (కె.కె. సెంథిల్ కుమార్ ఐఎస్‌సి),

12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్),

13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (రమా రాజమౌళి),

14. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ (నల్ల శ్రీను, సేనాపతి నాయుడు),

15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్-విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్)

ఇదీ చదవండి: పుష్ప-2లో బాలీవుడ్ హీరో..!

Exit mobile version