Site icon Prime9

Minor Girl Molestation : ఒరిస్సాలో దారుణ ఘటన.. 12 ఏళ్ల మైనర్ బాలికపై తోటి విద్యార్ధుల లైంగిక దాడి

12 years minor-girl-molestation in orissa

12 years minor-girl-molestation in orissa

Minor Girl Molestation : ఆడవారి పై దాడి .. ఒకప్పుడు ఈ మాట వింటే అంతా షాక్ అవ్వడం ,కోపంతో ఊగిపోవడం చూసేవాళ్ళం.కానీ ఇప్పుడు దాడి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న వయసులోనే ఆడవారి పై దాడులకు ఒడిగడుతున్నారు. చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దారి తప్పుతున్నారు. చేయకూడని పనులు చేస్తున్నారు. దారుణాలకు ఒడిగడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల ప్రభావమో, సినిమాల ప్రభావమో కానీ పిల్లలు పెడదోవ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియో జిల్లాలో దారుణం జరిగింది. నిండా 13ఏళ్లు కూడా లేని పిల్లలు 12ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశారు. ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడగా మరో కుర్రాడు ఇదంతా తన ఫోన్ లో వీడియో తీశాడు. ఈ ముగ్గురు పిల్లలు కూడా బాలికకు క్లాస్ మేట్స్ కావడం షాక్ కి గురి చేసే అంశం.

ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరిలో ఒకరి వయసు 13ఏళ్లు, మరొకరి వయసు 12ఏళ్లు. ముగ్గురు బాలురు కలిసి బాలికకు ఫోన్ చేసి బయటకు పిలిపించారు. ఫ్రెండ్స్ కావడంతో బాలిక వారిని కలిసేందుకు వచ్చింది. ఇంతలో ముగ్గురూ కలిసి బాలికను కిడ్నాప్ చేశారు. నిర్మానుషంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు పిల్లలు బాలికపై లైంగిక దాడి చేశారు. మూడో కుర్రాడు ఇదంతా వీడియో తీశాడు. అంతేకాదు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ మ్యాటర్ పోలీసులకు తెలిసింది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాఫ్తు చేపట్టారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వైద్య చికిత్సల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లలు ఎందుకిలా తయారయ్యారో అర్థం కాక అంతా తల పట్టుకున్నారు. పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వీడియో బయటకు రావడం వల్ల ఈ విషయం బయటపడింది , తెలియకుండా ఇంకా ఎన్ని దాడులు జరుగుతున్నాయో ఏమో ..

 

Exit mobile version