Site icon Prime9

Iranians Knock Turbans Off Clerics: ఇరాన్ లో మతగురువుల తలపాగాలు లాగేస్తున్న మహిళలు

Iran

Iran

Iran: ఇరాన్‌లో మత గురువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు మహిళలు. మూటముల్లె సర్దుకొని దేశం విడిచిపోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ వల్ల దేశం పూర్తిగా నాశనమైపోయిందని శాపనార్థాలు పెడుతున్నారు. తలపాగాతో కనిపించే ముస్లిం మత గురువుల పాగాలను లాగేస్తున్న వీడియోలు షోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మత గురువులు కనిపిస్తే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేకం ఉద్యమం ఊవ్వెత్తున ఎగిసిపడుతోంది. మహిళలు రోడ్లపైకి వచ్చి ఇరాన్‌ మత గురువులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పెట్టె బెడ సర్దుకుని దేశం నుంచి పోవాలని ఆవేశంగా వాగ్వాదానికి దిగుతున్న వీడియోలు షోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 22 ఏళ్ల మహషా అమిని హిజాబ్‌ సరిగా ధరించలేదని పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకొని కొట్టి చంపారు. అప్పటి నుంచి మొదలైన ఉద్యమం ఎంతకూ తగ్గడం లేదు. రోజు రోజుకు మరింత ఉధృతం అవుతోంది. మత గురువు తలపాగాతో కనిపిస్తే.. వారి పాగాను కింద పడేసి పరుగు పరుగున పోతున్న వీడియోలు ప్రస్తుతం షోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఒక మహిళ ఓ మత గురువును నీ పని నువ్వు చూసుకో మమ్మల్ని దుస్తులు ఇలా ధరించు..అలా ధరించు అని సలహాలు ఇవ్వొద్దు. మాకు మీరు వద్దే వద్దు. మీరు వట్టి మూర్కులు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరో వీడియోలో ఒక మత గురువుతో ఓ యువతి వాదనకు దిగారు. ఇది నాదేశం .. నా ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరిస్తాను.. మీరు ఎవరు నన్ను ఎక్కడ హిజాబ్‌ ధరించాలో ఎక్కడ ధరించరాదో అని సలహా ఇవ్వడానికి అంటూ నిలదీశారు. మీరు హిజాబ్‌ ధరించ వద్దనుకుంటే మీరు కూడా మాషిష్‌ ఎలైన్‌జెడ్‌ మాదిరిగా ఇంగ్లాండ్‌ వెళ్లిపోండి అని మత గురువు ఆవేశంగా అరవడం.. దీనికి బదలుగా యువతి ఆమె అమెరికాలో ఉంటుంది. ఇంగ్లాండ్‌లో కాదని గుర్తు చేశారు. అసంతృప్తి వాది అయిన మాషి ఇరాన్‌లో 2009 ఎన్నికల తర్వాత దేశ బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆమె అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. నేను విదేశాలకు వెళ్లను. ఇది నా మాతృభూమి ఇక్కడే ఉంటాను స్వేచ్చగా ఉంటాను అంటూ మత గురువుకు గట్టిగా సమాధానమిచ్చారు.

Exit mobile version