Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అవుతారనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఇప్పుడ మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో భారతీయ సంతతి వ్యక్తి అధ్యక్ష రేసులో నిలవనున్నారు. ఇప్పటికే భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకురాలు నిక్కి హెలీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు.. అధ్యక్ష పదవి పోటీలో నిలవనున్నారు.
ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున.. నిక్కీ హేలీ, మైక్ పెన్స్, మైక్ పాంపియో, వంటి వారు పోటీల్లో ఉండబోతున్నారు. ఇదే పార్టీ తరపున తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రచారం అవుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామి కూడా ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్ రామాస్వామి కూడా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే. ఇక రాజకీయంగా వివేక్‌కు పెద్దగా అనుభవం లేదు. అయినా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో నిలబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అగ్రరాజ్యంలో.. వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు సమర్ధిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
అయితే వివేక్ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల.. విమర్శలు వస్తున్నాయి. అతడికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని.. వోకియిజంపై అతడి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వివేక్ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకొస్తారని కొందరు నమ్ముతున్నారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ ‘రోయివంట్ సైన్సెస్’కు వ్యవస్థాపించారు. అలాగే దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్‌పై తన అభిప్రాయాలు వివరించి అందరి దృష్టిని ఆకర్షించారు.ప్రముఖ మేగజీన్ ‘ది న్యూయార్కర్’.. వివేక్ రంగస్వామిని ‘యాంటీ-వోక్ సీఈఓ’గా అభివర్ణించింది. వోకీ యిజం అంటే సామాజిక.. రాజకీయంగా అందరికి న్యాయం జరగడం లేదని బాధపడే మనస్తత్వం.
వివేక్ రామస్వామి కేరళ నుంచి అమెరికా వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు జన్మించారు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు. వోక్, ఇంక్.. ఇన్‌సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్ రచయిత. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన ఐదు ఔషధాలను రూపొందించాడు. ప్రస్తుతం రామస్వామి ప్రస్తుత నికర సంపద 500 మిలియన్ డాలర్లు. ఇవన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిగా వివేక్ రామస్వామిని చూడవచ్చని నమ్ముతున్నారు.