Site icon Prime9

Cough Syrup Death: దగ్గు, జలుబు సిరప్​ల కారణంగా 66 మంది చిన్నారులు మృతి

cough syrup deaths in Gambia

cough syrup deaths in Gambia

Cough Syrup Death: దగ్గు, జలుబు సిరప్​ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్​లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.

భారత దేశానికి చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. హరియాణా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు ‘కలుషిత’ సిరప్​లు కారణంగా ఆఫ్రికన్​ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి చెందారని, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు ఈ సిరప్ లు కారణం కావచ్చొన్న వస్తోన్న ఆరోపణ నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్టు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్​ ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు ఔషధాలైన ఈ నాలుగు సిరప్ లపై ఆ కంపెనీతోపాటు భారత్​లోని ఇతర నియంత్రణ సంస్థలతో సమన్వయం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిందని డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్ బుధవారం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబీకుల బాధ వర్ణనాతీతం అని ఆయన అన్నారు.

ప్రొమెథజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. వీటి ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించింది. ఈ ‘కలుషిత’ ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా, ఆ నాలుగు సిరప్​లు ఇతర ఏ మార్కెట్​లోనూ లేకుండా చేయాలని అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ సూచించింది. ఆయా సిరప్​లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొనింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్ కారణంగా మానవునికి చాలా హాని కలుగులుతుందని, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తుతాయని, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు వచ్చి చివరకు మరణానికి దారి తీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
ఆయా సిరప్ ల ఉత్పత్రికి సంబంధించిన సంస్థలు ఆయా సిరప్​లను విశ్లేషించి, క్లియరెన్స్​లు ఇచ్చే వరకు వాటిని హానికరమైన ఔషధాలగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ఇదీ చదవండి: “జర్నీ” సినిమా తరహా బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

Exit mobile version