Prime9 Desk: రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కారు బాంబు దాడి జరిగిందంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు పై బాంబు దాడి జరిగిన్నట్లు జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. అయితే ఘటన ఎప్పుడు చోటుచేసుకొనింది అన్న విషయాన్ని గుట్టుగా ఉంచారు. ప్రమాదం నుండి పుతిన్ సురక్షితంగా బయటపడ్డారంటూ కొన్ని వివరాలు వెల్లడైనాయి.
ఓ కార్యక్రమం నుండి పుతిన్ తన నివాసం కు వస్తుండగా తాను ప్రయాణిస్తున్న లిమోసిన కారు టైర్లలో ఒకటి భారీ శబ్ధంతో పేలిందన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాన్వాయిలో ఉన్న మరో కారు ద్వారా పుతిన్ ను సురక్షితంగా అధ్యక్ష నివాసానికి చేర్చిన్నట్లు టెలిగ్రామ్ ఛానల్ ప్రకటించింది. ఘటన చోటుచేసుకొన్న సమయంలో తొలి ఎస్కార్ట్ కారుకు ఓ అంబులెన్స్ అడ్డుగా వచ్చిందని ఛానల్ తెలిపింది. రెండో ఎస్కార్ట్ కారు ఆగకుండా వెళ్లిపోయిందని పేర్కొనింది.
ఘటన ఎప్పుడు చోటుచేసుకొనిందో స్పష్టం కావడం లేదు. అయితే ప్రమాదం తర్వాత పలు అరెస్టులు జరిగిన్నట్లు సమాచారం. అధ్యక్షుడు వ్యక్తిగత సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారణ చేసిన్నట్లు టెలివిజన్ ఛానల్ పేర్కొనింది. కొంతమంది అధికారులను విధుల నుండి తొలగించిన్నట్లు పేర్కొనింది.
ఉక్రయిన్ పై పుతిన్ సైనిక చర్యను ప్రారంభించిన అనంతరం ఆయనకు వ్యతిరేకత ఎదురౌతున్న నేపధ్యంలో కారు బాంబు ఘటన జరిగిన్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కధనాలు ప్రారంభమైనాయి. యుద్ధం సమయంలో ఉక్రయిన్ రక్షణ శాఖ స్వయంగానే కొన్ని విషయాలు బయటపెట్టింది. పుతిన్ పై దాడిచేసిన్నట్లుగా కూడా పేర్కొనింది. రష్యా మాత్రం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిన్నట్లు తెలుస్తుంది. 2017లో పుతిన్ స్వయంగా తన పై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. 5మార్లు తనపై దాడి చేసారన్న పుతిన్ తాను వాటికి భయపడేది లేదని అప్పట్లో పేర్కొని వున్నారు.