Site icon Prime9

Nepal Plane Crash: నేపాల్ విమానప్రమాదానికి ముందు ఎయిర్ హోస్టెస్ టిక్‌టాక్ వీడియో

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal Plane Crash: నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది.

విమానం కూలిపోయే ముందు ఫుటేజ్ లోపల తీయబడింది.ఆ దివారం నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Nepal Plane Crash)లో మరణించిన 72 మందిలో ఓషిన్ అలే మగర్ అనే ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నారు.

భారతదేశంలో చదువుకున్న ఓషిన్ విమానం ఎక్కి నవ్వుతూ కనిపించింది.

ఓషిన్ తన కుటుంబానికి పని ముగించుకుని పోఖారా నుండి తిరిగి వస్తానని చెప్పింది.

ఆమె తండ్రి మోహన్ అలె మగర్ రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సైనికుడు.

రెండు సంవత్సరాలుగా, ఒషిన్ ఏటి ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తోంది.

చిట్వాన్‌లోని మాడికి చెందిన ఓషిన్ ఉద్యోగం ప్రారంభించిన తర్వాత ఖాట్మండుకు వెళ్లింది.

ఓషిన్ కు ఒక సోదరుడు మరియు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిలో ఆమె పెద్దది. ఆమె సోదరుడి వయస్సు కేవలం నాలుగేళ్లు.

ఆమె తండ్రి మోహన్ మరియు తల్లి సబ్నం అలే మగర్ తమ కుమార్తె మృతదేహాన్ని గుర్తించడానికి పోఖారాకు చేరుకున్నారు.

ఓషిన్ రెండేళ్ల క్రితం పోఖారాలో వివాహం చేసుకుంది. ఆమె భర్త ప్రస్తుతం యూకేలో ఉన్నారు.

ఐదుగురు భారతీయులు కూడా..

ఆదివారం ఖాట్మండు నుండి పొఖారాకు బయల్దేరిన ఏటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది.

ఈ ప్రమాద సమయంలో 72 మంది అందులో ఉన్నారు. వీరిలో ఇండియాకు చెందిన ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు.

వీరిలో 68 మంది ప్రయాణికులు కాగా.. మరో నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం పొఖారా విమానాశ్రయం.. పాత విమానాశ్రయం మధ్య చోటు చేసుకొంది.

ఐదుగురు భారతీయుల్లో నలుగురు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందినవారు.

విమానం కదలిక వివరాలను చూపించే గ్రాఫ్ ప్రకారం, క్రాష్ జరగడానికి ముందు విమానం పైలట్ దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో కష్టపడ్డాడని తెలిసింది.

గ్రాఫ్ ప్రకారం, నేపాల్ విమానంనేలకూలడానికి ముందు ముందు 20 డిగ్రీల ట్రాక్ యాంగిల్ మరియు 78 కి.టి.ఎస్ గ్రౌండ్ స్పీడ్‌తో దాదాపు 1,24,900 అడుగుల గరిష్ట ఎత్తుకు చేరుకున్నట్లు వెల్లడైంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version