Bangladesh: బంగ్లాదేశ్ లో హిందూ బాలికను ముక్కలుగా నరికిన ప్రియుడు

దిల్లీలో శ్రద్దా వాకర్‌ ప్రియుడు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్‌ మరచిపోక ముందే బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 07:28 PM IST

Dhaka: ఢిల్లీలో శ్రద్దా వాకర్‌ ప్రియుడు ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్‌ మరచిపోక ముందే బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా అబుబకర్‌ అనే యువకుడు తన ప్రియురాలు కవితారాణిని చంపి ముక్కులు ముక్కలుగా చేసి పారిపోయాడు. అక్కడ అబు బకర్‌, కవితారాణిలు ప్రేమించుకున్నారు. అబు బకర్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన విధుల్లోకి రాకపోవడం. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో యజమాని ఓ వ్యక్తిని ఇంటికి వెళ్లి వాకబు చేయాలని కోరాడు. అబు బకర్‌ ఉండే అద్దె ఇంటికి వెళ్తే ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. కాగా గత కొన్ని రోజుల నుంచి అబుబకర్‌ కనిపించకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు అబుబకర్‌ ఇంటి తాళాలు తెరచిన వెంటనే అక్కడి సీన్‌ చూసి నిర్ఘాంతపోయారు. కవితా రాణి తల, చేతుల వేర్వేరు చేసి ఒక బాక్స్‌లో ఉంచేసి పరారయ్యాడు అబుబకర్‌. దీంతో పోలీసులు అబుబకర్‌ వేట ప్రారంభించారు. తర్వాత రోజు అంటే నవంబర్‌ 7వ తేదీన మరో అమ్మాయి సప్నతో కలిసి ఉంటున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి సప్నతో సహజీవనం చేస్తున్నాడు అబుబకర్‌. హత్య జరగడానికి ఐదు రోజుల ముందే కవితా రాణితో అబుబకర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నెల 5వ తేదీన అబుబకర్‌ తన అద్దె ఇంటికి ఆహ్వానించాడు కవితను. ఆ సమయంలో సప్న ఉద్యోగానికి వెళ్లింది. ఇద్దరి మధ్య తీవ్రమై న వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టరాని ఆగ్రహంతో కవిత గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత శరీరం నుంచి తలను వేరుచేసి తలను ఒక పాలిథిన్‌ బ్యాగ్‌లో ఉంచి శరీరాన్ని ఒక బాక్స్‌లో ఉంచి పరారయ్యాడు అబుబకర్‌.

హత్య చేసిన వెంటనే అదే రోజు రాత్రి అబుబకర్‌ తన ప్రియురాలు సప్నను తీసుకొని ఢాకాకు బయలు దేరి వెళ్లాడు. పోలీసులు కవిత మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని అబుబకర్‌ కోసం గాలింపు చేపట్టారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 6వ తేదీ రాత్రి అబుబకర్‌తో పాటు ఆయన ప్రియురాలు సప్నను గాజిపూర్‌ జిల్లాలో అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు సోనాడాంగా పోలీసుస్టేషన్‌లో అబుబకర్‌ను అప్పగించారు. పోలీసు కస్టడీలో తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ సంఘటన తర్వాతనైనా అమ్మాయిలు ఇలాంటి మోసగాళ్ల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు సామాజిక నిపుణులు.