Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 200 పైగా చేరుకుంది.
పాకిస్థాన్ లో ముష్కరులు చెలరేగిపోతున్నారు. అక్కడ వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో నిన్న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 93 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
దాడి జరిగిన వెంటనే.. సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఘటన స్థలానికి కేవలం అంబులెన్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ పేలుడు ధాటికి మసీదు చాలా మేరకు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
పేలుడు ప్రభావానికి మసీదు ప్రాంతం కుప్పకూలగా.. ఆ శిథిలాల కింద చిక్కుకుని కొందరు మరణించారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ కు ఉగ్రదాడి మరో సమస్యను తీసుకొచ్చింది.
భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పెషావర్‌లో కట్టుదిట్టమైన భద్రతలో కూడా ఈ దాడి జరిగింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు. ఈ దాడిలో దాదాపు 20 మంది పోలీసులు.. భద్రతా సిబ్బంది మృతి చెందారు.
ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎ ఒక్క ఉగ్రముఠా స్పందించలేదు.
భయాన్నిసృష్టించాలనే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానం.
గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. షియా మసీదులో జరిగిన దాడిలో 63మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మసీదులో బాంబు పెట్టారా.. లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
మసీదు వైపు రోడ్లను మూసీవేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.
బాంబు పేలిన ఘటనపై.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ Imran Khan స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దేశంలో ఉగ్రవాద ముప్పును అరికట్టాలని కోరారు.
ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దేశ ప్రధాని.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ.
ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/