Site icon Prime9

RRR : సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారిన #RRRforOscars హ్యాష్ టాగ్..!

rrrforoscars-hash-tag-trending-on-social-media

rrrforoscars-hash-tag-trending-on-social-media

RRR : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ” ఆర్ఆర్ఆర్ ” మానియా నడుస్తుంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పత్రాలు పోషించారు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, తారక్ కొమరం భీమ్ గా నటించి అందర్నీ మెప్పించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించగా… ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.

ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి దేశవిదేశాలనుంచి ప్రశంశలు దక్కాయి. గతంలో హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని అభిప్రాయ పడుతూ వార్తలను ప్రచురించాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ బరిలో తీసుకోకపోవడం గమనార్హం.

అయితే అందుకు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా అందుకు చిత్ర యూనిట్ కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి ఆర్ఆర్ఆర్ ని ఎంపిక చేయాలంటూ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. కాగా ఇప్పుడు వీరికి మద్దతుగా సోషల్ మీడియా లో కూడా #RRRforOscars పేరుతో ట్రెండింగ్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఖచ్చితంగా నిలవాలంటూ ప్రతి తెలుగు వారు బలంగా కోరుకుంటున్నారు.

ఆ 15 క్యాటగిరీలు ఏవంటే :

1. బెస్ట్ మోషన్ పిక్చర్ – డీవీవీ దానయ్య
2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్ఎస్ రాజమౌళి)
3. బెస్ట్ యాక్టర్ (ఎన్టీఆర్ – రామ్ చరణ్)
4. ఉత్తమ సహాయ నటి (అలియా భట్)
5. ఉత్తమ సహాయక నటుడు (అజయ్ దేవగన్)
6. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – (విజయేంద్ర ప్రసాద్ & రాజమౌళి)
7. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎంఎం కీరవాణి)
8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (‘నాటు నాటు’)
9. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (ఎ. శ్రీకర్ ప్రసాద్)
10. బెస్ట్ సౌండ్ (రాఘునాథ్ కెమిసెట్టి – బోలోయ్ కుమార్ డోలోయి – రాహుల్ కార్పే)
11. బెస్ట్ సినిమాటోగ్రఫీ (కె. కె. సెంథిల్ కుమార్)
12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్)
13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (రమా రాజమౌళి)
14. బెస్ట్ మేకప్ & హెయిర్ స్టైలింగ్ (నల్లా శ్రీను – సేనాపతి నాయుడు)
15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్).

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోయినా ఈ డిమాండ్ తో ఆస్కార్ జ్యూరీ సభ్యులను ఆకర్షిస్తుందేమో చూడాలి.

Exit mobile version