Site icon Prime9

Rishi Sunak: బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల బరిలోకి రుషి సునాక్

Rishi Sunak in the race for British Prime Minister

Rishi Sunak in the race for British Prime Minister

London: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కన్జర్వేటివ్ పార్టీలో వాతావరణం వేడెక్కింది. ఆ పార్టీకి చెందిన 100 ఎంపీల మద్ధతు తనకు ఉందంటూ భారత మూలాలకు చెందిన రుషి సునాక్ వెల్లడించారు.

ఈ మేరకు ఆయన నేటి నుండి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దడమే తన ప్రధాన కర్తవ్యంగా చెప్పుకొచ్చారు. దేశానికి సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రుషి ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సెప్టెంబరులో బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకున్నారు. అప్పట్లో ఆమె చేతిలో రుషి పరాజయం పాలయ్యారు. అయితే లిజ్ ట్రస్ తీసుకొన్న కొన్ని రాయితీ విధనాలు ఆ దేశ ఆర్ధిక మాంధ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. పీఠం ఎక్కిన 45 రోజుల్లోనే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. ప్రధానమంత్రి ఎన్నికలు అనివార్యమైనాయి. రుషి సునాక్ తో పాటు కామన్స్ సభ నేత పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి కోసం పోటీపడబోతున్న వారిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Timber Mafia: గాడిదలను కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు.. ఏ దేశంలోనంటే?

Exit mobile version