Site icon Prime9

Queen Elizabeth II: “విలియం ఐ హోప్..!” మనవడికి ఎలిజబెత్-2 రాణి చేతిరాత ఉత్తరం వైరల్

queen-Elizabeth's-sweet-handwritten-note-to-grandson-goes-viral

queen-Elizabeth's-sweet-handwritten-note-to-grandson-goes-viral

Queen Elizabeth II: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణానికి ముందు ఆమె తన మననడుకి ఓ లేఖ రాసింది. కాగా తన చేతితో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు వ్రాసిన ఈ గమనిక ఉత్తరం, ఆమె మరణించిన దాదాపు రెండు నెలల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఈ లేఖ యొక్క ఫొటోను రాజ అభిమాని ఖాతా ‘రియల్ రాయల్ మెయిల్’ ద్వారా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ స్టేషనరీపై కంపోజ్ చేయబడింది. మరియు క్రిస్మస్ సందర్భంగా ప్రిన్స్ విలియన్‌కి అడ్వెంట్ క్యాలెండర్‌తో పాటు ఇవ్వబడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తరం ఫొటోలో “‘విలియం, మీరు దీన్ని ప్రతిరోజూ తెరవడానికి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను మీ గ్రానీ’ అంటూ ఆమె చాలా సుందరమైన చేతి రాతతో లేఖలో పేర్కొన్నట్టు కనిపిస్తుంది.

ఈ నోట్ చాలా త్వరగా ఇంటర్నెట్‌లో ట్రాక్షన్ పొందింది. ఇది ఇప్పటికే 3,700 కంటే ఎక్కువ లైక్‌లను మరియు వందల కొద్దీ రీట్వీట్‌లను సంపాదించింది. ఇదిలా ఉంటే ఈ ఉత్తరంపై పలువురు నెటిజన్లు అనేక కామెంట్లు వేస్తున్నారు. “అయ్యో నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు!! వారిరువురికి మధ్య ఇంత అందమైన సంబంధం ఉందా అని ఒకరు,  “ఇది ప్రిన్స్ విలియమ్‌కు తిరిగి ఇవ్వాలి, ఇది అతనికి చెందినది. అతని వ్యక్తిగత జ్ఞాపకం.” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ది ఇండిపెండెంట్ రిపోర్టు ప్రకారం ఈ చేతితో రాసిన లేఖను బోస్టన్ ఆధారిత RR వేలం డిసెంబరు 2016లో వేలం వేసిందని. వేలం హౌస్ ప్రతినిధి ఈ నోట్‌ను “రాయల్‌లో చాలా అరుదుగా ఎదుర్కొన్న ఉత్తరప్రత్యుత్తరాల భాగం”గా వివరించారు.

బ్రిటన్‌లో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తిగా 70 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ II తన 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8న మరణించారు. ప్రిన్స్ విలియమ్‌తో పాటు, ప్రిన్స్ హ్యారీ, ప్రిన్సెస్ బీట్రైస్ మరియు ప్రిన్సెస్ యూజీనీతో సహా మరో ఏడుగురు మనవళ్లకు ఎలిజబెత్-2 రాణి నానమ్మ మరియు అమ్మమ్మకూడా.

ఇదీ చదవండి: సూర్యుడు నవ్వేస్తున్నాడు.. నమ్మరా.. ఇదిగో చూసెయ్యండి

Exit mobile version