Site icon Prime9

Modi-Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది- వైట్ హౌస్

modi putin

modi putin

Modi-Putin: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు సంవత్సరం కావోస్తుంది. ఈ యుద్ధ ముగింపు కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా ఇది పూర్తి కావడం లేదు. ఇంకా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తునే ఉంది. అయితే ఈ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉందంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంశంగా మారింది.

 

పుతిన్‌ను ఆపడం మోదీకి సాధ్యమే..!

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌ ను ఒప్పించడం మోదీకి సాధ్యమేనా అని అడిగిన ప్రశ్నపై అమెరికా స్పందించింది. ఈ యుద్ధాన్ని మోదీ ఆపగలరని పేర్కొంది. ఈ యుద్ధం ప్రారంభంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ఈ విషయంపై ప్రస్తుతం అమెరికా వైట్ హౌస్ స్పందించింది.

రష్యా సైనిక చర్యను ఆపడంలో.. ఈ యుద్ధానికి ముగింపు విషయంలో మోదీ PM Modi రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఒప్పించగలరా..? అని అడిగిన ప్రశ్నకు శ్వేతసౌధ ప్రతినిధి జాన్‌ కెర్బీ సమాధానమిచ్చారు. పుతిన్‌ ఈ యుద్ధాన్ని నిలిపివేయడానికి ఇంకా సమయం ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో.. మోదీ ఆయన్ని ఒప్పించగలరలని నమ్మకం వ్యక్తం చేశారు. దీనికోసం మోదీ తీసుకునే ఏ చర్యలకైనా తమకి అంగీకారమే అన్నట్లు వైట్ హౌస్ తెలిపింది.

ఉక్రెయిన్‌లో యుద్దానికి.. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితికి కారణమైన ఒకే ఒక్క వ్యక్తి పుతిన్‌. ఆ దురాక్రమణను ఇప్పటికిప్పుడే ఆపగల నమ్మకం ఉంది. కానీ దానికి బదులు అతడు క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. అక్కడి వ్యవస్థలను నీర్వీర్యం చేసి.. ప్రజలను మరింత ఇక్కట్లకు గురిచేస్తున్నాడని వెల్లడించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన మరుసటి రోజే ఈ స్పందన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యుద్ధం మొదలైన దగ్గరి నుంచి మోదీ.. అటు పుతిన్‌, ఇటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పలుమార్లు మాట్లాడారు. గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సులో భాగంగా పుతిన్‌తో సమావేశమయ్యారు. ఇది యుద్ధాల యుగం కాదంటూ సూచన చేశారు. ఈ మాటపై పాశ్చాత్య దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

 

Exit mobile version