China: ఒక్కో ఉద్యోగికి రూ. 6 కోట్ల బోనస్.. అవును మీరు విన్నది నిజమే. కరోనా వేళ అందరి ఉద్యోగాలు పోతుంటే.. రూ. 6 కోట్ల బోనస్ ఏంటని ఆలోచిస్తున్నారా.
ఇది నిజమే.. చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 6 కోట్ల బోనస్ ప్రకటించింది.
ఈ బోనస్ మెుత్తాన్ని కరెన్సీ రూపంలో ఇవ్వడంతో.. వాటిని మోసుకెళ్లడానికి ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతో దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి.
కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో మాత్రం.. పరిస్థితి భిన్నంగా ఉంది.
ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగిని తీసేయలేదు.. పైగా 30మంది ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది.
ఏకంగా ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్ యువాన్లు అందజేశారు.
అంటే భారత కరెన్సీలో రూ. 6కోట్లు అన్నమాట.
ఇక ఆ బోనస్ ను కరెన్సీ రూపంలో కంపెనీ ఇచ్చింది.
దీంతో కరెన్సీ కట్టల్ని తీసుకెళ్లడానికి ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు.
చైనా(China) కు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంది.
కరోనా ప్రభావం ఉన్న కూడా.. ఈ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది.
గతేడాది కరోనా కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా నష్టాలను చవిచూసినప్పటికీ, హెనాన్ మైన్ సంస్థకు మాత్రం భారీ లాభాలు వచ్చాయి.
ఉద్యోగులకు ప్రకటించిన బోనస్ ను వారి ఖాతాల్లో జమచేయకుండా.. కరెన్సీ కట్టల రూపంలో ఇచ్చింది.
కరెన్సీ కట్టలను.. గుట్టగా పేర్చి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించింది.
దీంతో ఆ బోనస్ మొత్తాన్ని చేతులతో తీసుకెళ్లలేక ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
ఓ పక్క ఆనందం.. మరోవైరు ఉద్వేగంతో కట్టల్ని మోసుకుంటూ ఉద్యోగులు వెళ్లారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/