Pakistan Floods: పాకిస్థాన్లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల పైగా ఇళ్ళు వరదల్లో మునిగిపోయాయి. పాకిస్థాన్లో మొత్తం వంద జిల్లాలు వరకు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. పాకిస్థాన్ కు సాయం చేయాలని భారత్ ఒక అడుగు ముందుకు వేసి, అన్ని సిద్దం చేసుకున్నట్టు తెలిసిన సమాచారం.
వరదల్లో మరణించిన కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేస్తూ సాయం చేయడానికి సహాయక చర్యలు చేపట్టాలని, ఈ వరదల వల్ల ఇల్లు నష్టపోయిన వారికి, తీవ్రంగా గాయపడిన వారికి, నష్టపోయిన కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని మోదీ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి వెల్లడించారు.
గతంలో కూడా భారత్, పాకిస్థాన్ కు సాయం చేసింది. ఇంకో వైపు పాకిస్థాన్లో పంట వేసిన వారు బాగా దెబ్బ తిన్నారని, కూరగాయ రేట్లు కూడా బాగా పెరిగాయని, నిత్యవసర వస్తవులను దిగుమతి చేసుకొనే ఆలోచనలో ఉన్నామని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి తెలిపారు.