China: చైనాలోని దక్షిణ ప్రావిన్స్ హునాన్ రాజధాని చాంగ్షా డౌన్‌టౌన్‌లోని ఎత్తైన కార్యాలయ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. చైనా టెలికాం భవనంలోని 42వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
సంఘటనా స్దలం నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. పలు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి సిద్దమయ్యారు. మంటలను ఆర్పడానికి 36 అగ్నిమాపక వాహనాలు మరియు 280 అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
స్థానిక చైనీస్ న్యూస్ అవుట్‌లెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో చైనాలోని చాంగ్‌షా నగరంలో పూర్తిగా నల్లగా కాలిపోయిన టవర్ కనిపించింది. ఆకాశంలోకి నల్లటి పొగలు కమ్ముకోవడంతో భవనంలో మంటలు చెలరేగినట్లు వీడియోలో చూపించారు. హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో దాదాపు 10 మిలియన్ల జనాభా ఉంది.