Site icon Prime9

King Charles III: బ్రిటన్ రాజు చార్లెస్-3కి చేదు అనుభవం

man-detained-for-throwing-eggs-at-king-charles3-in-uk

man-detained-for-throwing-eggs-at-king-charles3-in-uk

King Charles III: గ్రేట్ బ్రిటన్‌ రాజైన చార్లెస్‌- 3కి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ చార్లెస్‌-౩ తన భార్య కెమిల్లాతో కలిసి ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి వేడకకు హాజరైన వారితో రాజు షేక్ హ్యాండ్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.

బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటగా ఉత్తర ఇంగ్లండ్లో ఆయనకు చేదు అనుభవం సంభవించింది. కింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజు దంపతులపైకి ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బ్రిటన్లో కలకలం సృష్టించింది. అనుకోని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రాజు దంపతులు సైతం కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఆ నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే చార్లెస్‌- 3 ఈసారి మాత్రం తనపై దాడి జరుగుతున్నా అలానే చూస్తుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా మొత్తం మూడు కోడిగుడ్లు విసరినట్లు అధికారులు తెలిపారు. కానీ అవి కింగ్‌ ఛార్లెస్‌ కు తగలలేదని అతని కాళ్ల దగ్గర పడ్డాయని తెలిపారు.

బ్రిటన్ రాణి క్వీన్‌ ఎలిజిబెత్-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఎలిజిబెత్‌ మరణం అనంతరం బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరి

Exit mobile version