Site icon Prime9

Kenya Road Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి

kenya road accident leads to 48 death and heavy damage of vehicles

kenya road accident leads to 48 death and heavy damage of vehicles

Kenya Road Accident : కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని  కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నారని అనుమానిస్తున్నట్లు కెన్యా దేశ పోలీసు కమాండర్ జియోఫ్రీ మాయెక్ చెప్పారు.

కాగా ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని పోలీసులు చెప్పారు. అదుపు తప్పిన ఆ ట్రక్ దాదాపు పలు వాహనాలను ఢీ కొడుతూ వెళ్ళడం వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తుంది.  అయితే కెన్యాలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంపై కెరిఖో కౌంటీ గవర్నర్ ఎరిక్ ముటాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Exit mobile version