Site icon Prime9

Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 14 ఏళ్లు జైలు శిక్ష

Imran Khan

Imran Khan

Imran Khan: తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్‌ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్‌ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్‌ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

ఇక తోషాఖానా కేసు విషయానికి వస్తే .. అప్పటి అధికారపార్టీ .. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం 2022లో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌కు ఇమ్రాన్‌ఖాన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. విదేశీ అతిథులు పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు ఇచ్చిన గిఫ్ట్‌లను కాజేశాడనేది ప్రధాన ఆరోపణ. వాస్తవ ధర కంటే అతి తక్కువ చూపించి స్వంతానికి వాడుకున్నారనేది పాక్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్‌ ముందుగా ఆయనపై అనర్హత వేటు వేసింది. అదే సమయంలో ఆయనపై సెషన్‌ కోర్టులో క్రమినల్‌ కేసు ఫైల్‌ చేసింది. కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలుకు పంపించింది.

గిఫ్ట్‌ల సమాచారం ఇవ్వకుండా..(Imran Khan)

ఇక ఈ కేసు పూర్వా పరాల విషయానికి వస్తే ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ 2018 నుంచి 2022 వరకు కొనసాగారు. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లివచ్చినప్పడు ఆ దేశాధినేతలు ఇచ్చిన గిఫ్ట్‌లను ప్రభుత్వానికి చెందిన తోషాఖానా అంటే గవర్నమెంట్‌ ట్రెజరీలో జమ చేయాలి. ఈ గిఫ్ట్‌లను అతి తక్కువ ధరకు ఖాన్‌ సొంతం చేసుకున్నాడనేది ఆయన పై వచ్చిన ప్రధానమైన ఆరోపణ.ఇక తోషాఖానా నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లివచ్చినప్పుడు వచ్చిన గిఫ్ట్‌లను నిబంధనల ప్రకారం కెబినెట్‌ డివిజన్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక ఖాన్‌ విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చిప్పుడు ఆయనకు సమారు 58 గిఫ్ట్‌లు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఖాన్‌ మూడున్నర సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ లీడర్లు ఆయనకు 14 కోట్ల రూపాయల విలువై గిఫ్ట్‌లు ఇచ్చారు. అయితే దీనికి ఆయన చెల్లించింది నామమాత్రమే. కొన్ని వస్తువులకు ఆయన ఎలాంటి డబ్బు చెల్లించలేదనేది ఆయనపై వచ్చిన ఆరోపణ.

ఇక తోషాఖానా కేసుకు సంబంధించి పోలీసులు ఆగస్టు 5, 2023న లాహోర్‌లో ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు. అప్పుడు జిల్లా కోర్టు ఆయనకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వచ్చిన గిఫ్ట్‌లను చట్టవ్యతిరేకంగా అమ్ముకున్నారని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా తోషా ఖానా కేసు శిక్షను పాకిస్తాన్‌ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే జిల్లా కోర్టు హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా బుధవారం నాడు తోషాఖాన్‌కు కేసు సంబంధించి తీర్పు వెలువరించింది. అయితే జిల్లా కోర్టు తీర్పు విషయానికి వస్తే నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా అవినీతికి పాల్పడ్డారని చార్జీలు మోపింది. జిల్లా కోర్టు ఎన్‌ఏబీ చార్జీలను పరిగణనలోకి తీసుకొని తోషాఖానాఖు కేసుకు సంబంధించి భార్యభర్తలను దోషిగా నిర్థారించి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Exit mobile version