Site icon Prime9

Imran Khan: నాపై దాడిజరుగుతుందని ముందే తెలుసు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pakistan

Pakistan

Imran Khan : తనపై దాడి జరుగుతుందని ముందే తెలుసని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వజీరాబాద్ ర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ లాహోర్ హాస్పిటల్ నుంచి మీడియాతో మాట్లాడారు.

గుజరాత్‌లోని వజీరాబాద్‌లో నన్ను హతమార్చేందుకు ప్లాన్‌ చేశారని దాడికి ఒకరోజు ముందు తనకు తెలిసిందని వెల్లడించారు. నలుగురు వ్యక్తులు మూసి ఓ గదిలో తలుపులు వేసుకొని నా హత్యకు ప్లాన్ చేశారు. దీనిపై ఓ వీడియో తీసి ఉంచాను. నాకు ఏదైనా జరిగితే ఆ వీడియోను విడుదల చేయాలని నేను సూచించాను. మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను 2011లో మత తీవ్రవాది హత్య చేసిన విధంగానే నన్ను చంపేందుకు ముగ్గురు అత్యున్నత అధికారులు పన్నాగం పన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

కంటైనర్ పై నిల్చొని ఉండగా, ఉన్నట్టుండి కాళ్లకు బుల్లెట్లు తాకాయి. మొత్తం 4 బుల్లెట్లు తగలడంతో పడిపోయానని.. జరిగిన ఘటనను ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఇద్దరు దుండగులు కనిపించారని.. వారిద్దరూ ఒకేసారి కాల్పులు జరిపి ఉంటే తను బతికేవాడిని కాదన్నారు. కాలికి తగిలిన బుల్లెట్ గాయాల ఎక్స్ రే చిత్రాలను డాక్టర్ సాయంతో ప్రదర్శించారు.మొదట తనపై దైవ దూషణ ఆరోపణలు చేశారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దీనికి సంబంధించిన టేపులను తయారు చేసి విడుదల చేశారని, దానిని పీఎంఎల్ఎన్ ప్రొజెక్ట్ చేసిందని తెలిపారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఇమ్రాన్ పేర్కొన్నారు.

Exit mobile version