Hamas hostages: 17 మంది బందీలను విడుదల చేసిన హమాస్

ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 06:48 PM IST

Hamas hostages: ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.

ఇజ్రాయెల్ కు కు తరలిన బందీలు..(Hamas hostages)

ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకారం, విడుదలైన బందీలను ఇజ్రాయెల్‌కు తరలించారు. వారిని అబ్జర్వేషన్‌ కోసం హాస్పిటల్‌కు అక్కడ నుంచి వారి కుటుంబాలతో కలిపేందుకు తరలించారు.ముసుగులు ధరించిన ఉగ్రవాదులు గాజా నుండి బయలుదేరిన రెడ్‌క్రాస్ వాహనాల వద్దకు తీసుకువెడుతుండగా బందీలు వణుకుతున్నట్లు చూపించే వీడియోను హమాస్ విడుదల చేసింది.హమాస్ శనివారం విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీలలో ఏడుగురు పిల్లలు మరియు ఆరుగురు మహిళలు ఉన్నారని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.విడుదలైన బందీలలో ఎక్కువ మంది హమాస్ మిలిటెంట్లు అక్టోబరు 7న సరిహద్దు దాడిలో విధ్వంసం చేసిన కిబ్బట్జ్ బీరీకి చెందిన వారేనని కిబ్బత్జ్ అధికార ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ అనుమతించిన సహాయ డెలివరీలు వాగ్దానం చేసిన దానికంటే తక్కువగా ఉన్నాయని, అవి ఉత్తర గాజాకు చేరుకోవడం లేదని హమాస్ ఆరోపించింది.

కాల్పుల విరమణ మొదటి రోజు, హమాస్ దాదాపు 240 మంది బందీలలో 24 మందిని విడుదల చేసింది. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను జైలు నుండి విడుదల చేసింది. గాజాలో విముక్తి పొందిన వారిలో 13 మంది ఇజ్రాయల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ కు, ఒకరు ఫిలిఫ్పైన్ కు చెందినవారు. మొత్తంమీద హమాస్ నాలుగు రోజుల సంధి సమయంలో కనీసం 50 మంది ఇజ్రాయెలీ బందీలను మరియు ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాను.

హమాస్ కమాండర్ మృతి..

మరోవైపు తమ అగ్ర కమాండర్లలో ఒకరైన అహ్మద్ అల్-ఘండూర్ మరణించినట్లు హమాస్ ఆదివారం తెలిపింది.ఉత్తర గాజాలో గ్రూప్ సాయుధ విభాగంలో ఉన్నత స్థాయి సభ్యుడు మరియు హమాస్ టాప్ కమాండర్ అయిన అల్-ఘండూర్ మరణించినట్లు ప్రకటించింది. అయితే, అతను ఎప్పుడు, ఎక్కడ చంపబడ్డాడో హమాస్ పేర్కొనలేదు.అతను మూడుసార్లు ఇజ్రాయెల్ దాడులనుంచి తప్పించుకున్నాడు.