Elon Musk-Tamil Movie Poster:ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్‌ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు. అయితే మస్క్ ఏది చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన అమెరికా అధ్యక్షుడి రేసులో ఒకసారి బైడెన్‌కు మద్దతు తెలిపితే మరోమారు ట్రంప్‌కు మద్దతు ఇచ్చి వివాదాస్పదుడిగా నిలిచారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే గత రెండు రోజుల నుంచి ఆపిల్ WDC24 ఈవెంట్ జరిగిన తర్వాత నుంచి ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ కంపెనీ ఆపిల్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలెన్స్‌ను షార్ట్ ఫాంలో ఏఐగా సంబోధిస్తారు. అయితే ఆపిల్ మాత్రం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆపిల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐగా పేరు పెట్టింది. ఇది మస్క్‌కు నచ్చలేదు. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను గూగుల్ జెమిని అని పేరు పెట్టింది. అలాగే ఆపిల్ కూడా ఏఐ బదులు వేరే పేరు పెట్టవచ్చుగదా అని అంటున్నాడు ఎలాన్ మస్క్.
డేటా చౌర్యం (Elon Musk-Tamil Movie Poster)
ఇవన్నీ ఒక ఎత్తయితే ఎలాన్ మస్క్ ఆపిల్‌పై మరో విమర్శ చేశారు. ఐ ఫోన్‌ను ఆపిల్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు చేపడితే.. తేలికగా డేటా చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ఆయన ఒక మెమ్‌ను జత చేశారు. ఒక అమ్మాయి కొబ్బిరి బొండా నుంచి స్ర్టా ద్వారా కొబ్బరి నీరు తాగుతుంటే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె నోట్లో స్ర్టా పెట్టి కొబ్బరి నీరు తాగుతుండే తమిళ సినిమా పోస్టర్ పెట్టాడు మస్క్.. మస్క్ అర్ధం ఏమిటంటే డేటా చౌర్యం ఒకరి నుంచి మరొకరి పోతుందనే ఉద్దేశంతో ఆ పోస్టర్ పెట్టాడు.
నిర్మాతల ఖుషీ..
ఇదిలా ఉంటే ఈ మెమ్ వైరల్ అయ్యింది. ఇక ఈ తమిళ సినిమా పోస్టర్ విషయానికి వస్తే 2017లో విడుదలైన తమిళ సినిమా ‘తెప్పట్టమ్”కు సంబంధించింది. ఎలాన్ మస్క్ పుణ్యాన ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా నిర్మాతల సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. తమ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినందుకు మస్క్‌కు వారు ట్విట్టర్‌లో ధన్యవావాలు తెలిపారు. అయితే మస్క్ ఏ ఉద్దేశంతో ఈ పోస్టర్ పెట్టాడో తమిళ తంబిలకు అర్ధం కాలేదనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్.