Site icon Prime9

Kamma vs Kapu Issue : అమెరికాలోని డల్లాస్‌లో కమ్మ – కాపు గొడవ… అసలు నిజమేంటి?

detailed explaination about dullas telugu people fight

detailed explaination about dullas telugu people fight

Kamma vs Kapu Issue : న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో గొడవ జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అసలు జరిగిందేంటో ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ చెప్తూ గొడవలో కొట్టుకోడం, తిట్టుకోడం ఈవెంట్ ఆర్గనైసర్స్ పోలీస్ లకి ఫోన్ చెయ్యడం… వాళ్ళు వచ్చి అరెస్ట్ చెయ్యడం.. అంతా ఒక సినీ ఫక్కీలో జరిగింది. అయితే ఇదంతా గొడవలో ఒక పార్ట్ మాత్రమే… పవన్ కళ్యాణ్ ఫాన్స్ బాలయ్య ఫాన్స్ ని కొట్టినట్టు, గొడవ జనసేన టీడీపీ అభిమానుల మధ్య అన్నట్టు వైసీపీ మీడియా చిత్రీకరిస్తుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో ఒక ఈవెంట్ జరిపారు.. అయితే సంక్రాంతికి వస్తున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య పోస్టర్ లు బాలయ్య అభిమానులు కింద పడేసిన క్రమంలో చిరంజీవి అభిమానులు వెళ్లి ప్రతిఘటించారు. చిరంజీవి పోస్టర్ లు తీసి మళ్ళీ గాల్లో ఊపుతూ హడావిడి చేస్తున్న తరుణంలో ఇద్దరి అభిమానుల మధ్య ఎక్కడ గొడవ జరుగుతుందో అని పెద్దలు వచ్చి సర్ది చెప్పడం తో ఆ గొడవ అక్కడితో అయిపొయింది.. ఈ గొడవలో ఎలాంటి కొట్లాట, రక్తపాతాలు జరగలేదు పెద్దల చొరవతో సర్దుమణిగింది..

ఇప్పుడు అసలు జరిగిన గొడవ టీడీపీ వైసీపీ మధ్య.. టీడీపీ పాటలు పెడితే వైసీపీ వాళ్ళు, వైసీపీ పాటలు పెడితే టీడీపీ వాళ్ళు గొడవ చేశారు, పార్టీ పాటల దగ్గర వచ్చిన ఘర్షణలో టీడీపీ వైసీపీ అభిమానుల మధ్య కొట్లాట జరిగితే., పవన్ కళ్యాణ్ అభిమానులని అలగా జనం అన్న బాలయ్య టాక్ షో కి పవన్ కళ్యాణ్ ఎలా వెళతాడు అని బాలయ్య ఫాన్స్ రెచ్చగొట్టడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొట్టినట్టు అది జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ, కమ్మ కాపు మధ్య గొడవ అని వైసీపీ చిత్రీకరించింది..

గొడవ జరుగుతున్నప్పుడే మన ప్రమేయం ఉంటె పార్టీ కి చెడ్డ పేరు అని జనసేన కార్యకర్తలు ముందే అక్కడనుండి నిష్క్రమించినా అకారణంగా జనసేన ని లాగుతున్నారు.. జనసేన పవన్ కళ్యాణ్ పేరు వైసీపీ వారు నిద్ర లో కూడా కలవరిస్తున్నారు అని చెప్పుకొచ్చారు..

Exit mobile version