Site icon Prime9

Covid 19 : మరింత డేంజర్ గా కరోనా… బీఎఫ్ 7 కంటే ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ డేంజరా… దేశంలో ఫస్ట్ కేసు

corona case registered in gujarath state with new variant bb1.5

corona case registered in gujarath state with new variant bb1.5

Covid 19 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. ముఖ్యంగా చైనాలో బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా బీఎఫ్7 వేరియంట్ కేసులు మూడు నమోదయ్యాయి. తాజాగా మరో ప్రమాదకరమైన కరోనా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్ రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. ఈ వేరియంట్ ను సూపర్ వేరియంట్ గా నిపుణులు పేర్కొంటున్నారు.

దీని కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది అన్ని రకాల వేరియంట్ల కంటే వేగంగా మన రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని చైనీస్ ములాలున్న అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ పేర్కొన్నారు. గత వేరియంట్ బీక్యూ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాధిని వ్యాప్తి చేస్తుందని సూచించారు. ఈ కొత్త వేరియంట్ ను గుర్తించిన 17 రోజుల్లోనే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు వారాల్లో కొత్త వేరియంట్ బారిన పడినవారి సంఖ్యను సీడీసీ వెల్లడించలేదని ఎరిక్ తెలిపారు. చైనా మాదిరిగానే అమెరికా కూడా కొత్త వేరియంట్ డాటాను దాచి పెడుతోందని ఆరోపించారు.

ఈ తరుణంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంది మరోమారు గతంలో జరిగిన దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version