China Spy Balloon: చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా ..
ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
బెలూన్ల సహాయంతో కొన్నేళ్లుగా డ్రాగన్ స్పై గా వ్యవహరిస్తోందని అమెరికా వెల్లడించింది.
పురాతన పద్దతులకు టెక్నాలజీని కలిపి వివిధ దేశాలపై నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది చైనా.
ఐదు ఖండాల్లో చైనా బెలూన్లు
తాజాగా భారత్ తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్ .. ఇలా మరికొన్ని దేశాలపైన బెలూన్ల ను ఎగురవేసి ఆ దేశాల సైనిక సమాచారాన్ని సేకరిస్తోందని ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ వాషింగ్టన్
పోస్టు కథనాలు చెబుతున్నాయి.
వాషింగ్టన్ పోస్టు ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి కొన్నేళ్లుగా పనిచేస్తున్న నిఘా బెలూన్ ప్రయత్నం జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ సహా చైనాకు
వ్యూహాత్మక ఆసక్తి ఉన్న దేశాలు, ప్రాంతాల్లోని సైనిక సమాచారాన్ని సేకరించింది.
ప్రపంచంలోని ఐదు ఖండాల్లో ఇటువంటి బెలూన్లు కనిపించాయి. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు వాషింగ్టన్ పోస్టుకు తెలిపారు.
40 రాయబార కార్యాలయాలకు సమాచారం
అమెరికా సున్నితమైన స్థావరాలపై తేలియాడుతున్న చైనా నిఘా నౌకను అమెరికా మిలిటరీ ఫైటర్ జెట్ కూల్చివేసిన కొద్ది రోజులకే ఈ నివేదిక బయటకు వచ్చింది.
హై ఆల్టిట్యూడ్ నిఘా బెలూన్ ను స్వాధీనం చేసుకున్న వరుస చిత్రాలను కూడా పెంటగాన్ అధికారులు విడుదల చేశారు.
అమెరికా డిప్యూటి విదేశాంగ శాఖ మంత్రి వెండీ షెర్మన్ చైనా బెలూన్ల వ్యవహారంపై 40 రాయబార కార్యాలయాల భద్రతా ప్రతినిధులు, దౌత్త వేత్తలకు సమచారం అందజేశారు.
భారత్ తో పాుటు మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా భద్రతా అధికారులు హెచ్చరించారు
చైనా నిఘా ఎయిర్ షిప్ లుగా గుర్తించిన ఈ బెలూన్లన్నీ నిఘా కార్యకలాపాలు నిర్వహించడానికి అభివృద్ధి చేసిన పీఆర్సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) బెలూన్లలో భాగమని, ఐదు ఖండాల్లో వీటిని
గుర్తించినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
ఇది ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కూడా ఉల్లంఘించినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
చైనా తీవ్ర అభ్యంతరం
అయితే ఆ బెలూన్లు శాటిలైట్ సంబంధిత ఎయిర్ షిప్స్ అని చైనా వాదిస్తోంది. బెలూన్ కూల్చివేతలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికా మాత్రం పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
గత వారం హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్ ప్రాంతాల్లో కనీసం నాలుగు బెలూన్లు కనిపించాయని అధికారులు తెలిపారు.
నాలుగు బెలూన్లలో మూడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగాయన్నారు.
అయితే అవి చైనా బెలూన్ల అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారులు నివేదిక తెలిపింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/