Site icon Prime9

China: మళ్లీ లాక్‌డౌన్.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు

corona XXB variant in Maharashtra

corona XXB variant in Maharashtra

China: కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పోయిందనుకున్న మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుంది. చైనాలో రోజురోజుకీ భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దానితో వైరస్‌ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో లాక్‌డౌన్ విధించింది.

చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఫెన్ యాంగ్ సిటీలో వైర‌స్ టెస్టింగ్ నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా లాక్ డౌన్ విధించినట్టు తెలుస్తోంది. అంతేకాక ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజ‌ధాని హోహాట్‌లోనూ కరోనా ఆంక్షలు విధించింది జిన్ పింగ్ ప్రభుత్వం. బ‌యిటి నుంచి ఈ ప్రాంతాలకు వ‌చ్చే వాహ‌నాల‌ను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రక‌టించారు. ఇదిలా ఉండగా గ‌డిచిన 12 రోజుల్లో ఆ న‌గ‌రాల్లో సుమారు 2వేల‌కుపైగా కొవిడ్ కేసులు న‌మోదయిన‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనితో అప్రమత్తమైన అధికారులు కేసులు భారీగా పెరుగుతున్న కొన్ని ప‌ట్టణాల్లో సోమ‌వారం నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్ల అమలు ప్రారంభించారు.

ఇంకోవైపు వ‌చ్చే వారం నుంచి బీజింగ్‌లో క‌మ్యూనిస్టు పార్టీ స‌మావేశాలు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో పార్టీ స‌మావేశాల‌పై కొవిడ్ ప్రభావం ప‌డ‌కుండా ఉండేందుకు ఈ ముంద‌స్తు లాక్‌డౌన్లు అమ‌లు చేస్తున్నట్లు అర్థమ‌వుతోంది. జీరో కోవిడ్ పాల‌సీలో భాగంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కుక్క అనుకుని నక్కని పెంచుకున్నారు..!

Exit mobile version
Skip to toolbar