Site icon Prime9

Liz Truss Resigns: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

British Prime Minister Liz Truss resigns

British Prime Minister Liz Truss resigns

London: రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ లో పరిస్ధితులు తారస్థాయికి చేరుకోన్నాయి. దీంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ లో అతి తక్కువ రోజులు పాలన చేసిన ప్రధానిగా ట్రస్ రికార్డుకెక్కారు. ఆమె కేవలం 44 రోజులే పదవిలో కొనసాగగలిగారు.

కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన లిజ్ ట్రస్ ను సెప్టెంబర్ 5న ప్రధాని పీఠం వరించింది. ఆర్ధిక ద్రవ్యోల్భణ నియంత్రణపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఆమె ప్రవేశ పెట్టిన మిని బడ్జెట్ ప్రభావం ఆ దేశ మార్కెట్లుపై పడ్డాయి. డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వంటి అంశాలు ఆమెకు తలనొప్పిగా మారాయి. దీంతో కొద్ది రోజులు కిందట ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

నిన్నటిదినం ప్రధాన మంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి లిజు ట్రస్ పార్లమెంటుకు వచ్చారు. ఆ సందర్భంగా ఆమె రాజీనామా చేయాలంటూ కొందరు ఎంపీలు నినాదాలు చేశారు. ఆ సమయంలో వాటిని ఖండించిన ఆమె నేను ఎదురొడ్డి పోరాడే వనితను. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, బరి నుండి పారిపోయేదానిని కాను అంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మెర్ కు బదులిచ్చింది. అయితే మరుసటి రోజే లిజు ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

ఒక దశలో ఆమె పాలనలో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యాన్ని చవిచూసింది. దీంతో ఆ దేశంలో గందరగోళం నెలకొనింది. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని, తదుపరి ప్రధానిని ఎన్నుకొనేంతవరకు పదవిలో కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు. నేను పదవిని చేపట్టే సమయానికే దేశం తీవ్రమైన ఆర్ధిక, అంతర్జాతీయ అస్ధితరత కొనసాగుతున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన్నట్లు ఆమె తెలిపారు.

లిజ్ ట్రస్ పాలనపరంగా తొలి నుండి ఆమెకు హంసపాదే ఎదురైంది. తీసుకొన్న పలు నిర్ణయాలు యూ టర్న్ లుగా మారాయి. సామన్య ప్రజలతో సమానంగా దనిక వర్గాలకూ ఇంధన రాయితీ అంశం పెద్ద దుమారమే లేపింది. ప్రతి కూలత కన్నా కూడా సొంత పార్టీల నేతల నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము చేసిన తప్పిదాలకు క్షమించాలని కూడా ఆమె కోరారు. ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానం ఆమెపై పెట్టాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్న సమయంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Earthquake: ఖాట్మాండ్ లో భూకంపం

Exit mobile version