Gold Fish: మనం సర్వసాధారణంగా ఆక్వేరియంలలో గోల్డ్ ఫిష్ పెంచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతాం. ఎందుకంటే అవి ఆరెంజ్ మరియు బంగారం వర్ణం కలగలిపి చాలా అందంగా చిన్నగా, రూపాయి కాయిన్ పరిమాణంలో ఉంటాయి. నీటి తొట్టిలో అటూ, ఇటూ కదులుతూ ఎంతో ఆకర్షిస్తుంటుంది. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉంటే ఎలా ఉంటుంది అంటారు. అసలు అంత పెద్ద గోల్డ్ ఫిష్ ఉందని చెబితే మీరు నమ్మగలరా..? కానీ, నమ్మాల్సిందే. ఫ్రాన్స్ దేశంలో వేటకు వెళ్లిన ఓ జాలరి వలకు ఈ భారీ సైజు గోల్డ్ ఫిష్ చిక్కింది.
చాలా మందికి గోల్డ్ ఫిష్ అంటే చిన్నసైజు చేప అనే విషయం తెలుసు. కానీ, ఇప్పుడు ఈ జాలరికి చిక్కిన భారీ సైజు గోల్డ్ ఫిష్ చూస్తే ప్రపంచ యావత్తు ఆశ్చర్యానికి లోనవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్ గా దీనిని చెప్తున్నారు.‘‘క్యారట్ (గోల్డ్ ఫిష్) వలకు చిక్కిందని తెలుసు. కానీ, ఇంతపెద్దదని నేను అనుకోలేదని’’ అని సదరు జాలరి పేర్కొన్నాడు. బ్లూవాటర్ లేక్స్ ఫేస్ బుక్ పేజీ ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: 10 గంటల్లో 62 సార్లు.. 162 మంది మృతి