Site icon Prime9

South Korea: ఒకేసారి 100 మందికిపైగా గుండెపోటు.. 149 మంది మృతి

south Korea incident 100 people got heart attack

south Korea incident 100 people got heart attack

South Korea: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ప్రతి ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు.

సియోల్ లోని ఓ ఇరుకైన రోడ్డులో దాదాపు లక్షమందికిపైగా ప్రజలు ఒకేసారి గుమిగూడారు. దానితో ప్రజలందరికీ శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ప్రజల అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో వారి మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు. మరో 100 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది గుండెపోటుకు గురయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణనష్టం ఇంకా పెరగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మృతుల సంఖ్యను దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

దాదాపు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలో దించి సహాయక చర్యలు చేపట్టారు. ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడిఉన్నవారిని స్ట్రెచర్లపైకి చేరుస్తూ కొందరు, అత్యవసర గుండె చికిత్సలు అందిస్తూ మరికొందరు కనిపించారు. ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్ లో సమీపంలోని ఓ బార్‌కు ఒక హీరోయిన్ వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒకేసారి అనేకమంది ప్రయత్నించడమే ఈ తొక్కిసలాటకు కారణమని స్థానిక మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే ఏటా పెద్ద ఎత్తున జరుపుకునే ఈ వేడుకలు కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు జరుపుకోకపోవడం వల్ల ఈ సారి పెద్దసంఖ్యలో ఈ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇటీవల కాలంలోనే కరోనా ఆంక్షల్ని సడలించడంతో వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని స్థానిక అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. హత్య లేక ఆత్మహత్యా..?

Exit mobile version