Site icon Prime9

iPhone: త్వరలో ఐఫోన్ యూజర్లకు 5g సేవలు

apple updating 5G software prime9 news

apple updating 5G software prime9 news

iPhone: దేశంలో ఇప్పుడిప్పుడే నవినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. దీనితో స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు సైతం పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి.

తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ సైతం వారు తయారు చేసే ఐఫోన్‌లలో 5జీని సపోర్ట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను వచ్చేవారం ఇవ్వనున్నామని ప్రకటించింది. మొదట టెస్టింగ్‌లో భాగంగా ఐఎస్‌ 16 బెటా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.  తరువాత ఐఫోన్‌14, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ ఎస్‌ఈ (థార్డ్‌ జనరేషన్‌) ఫోన్‌లలోనూ ఈ 5జీ సేవలకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వనున్నట్టు యాపిల్ వెల్లడించింది. ఐఫోన్‌లలో 5జీ సేవలు ఎలా ఉన్నాయనేది వినియోగదారులు ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియజేయాలని సంస్థ తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సి పనిలేదని పూర్తిగా ఉచితమని యాపిల్‌ తెలిపింది. డిసెంబర్‌లో తుది అప్‌డేట్‌ను వినియోగదారులందరికీ అందిస్తామని యాపిల్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఐటీ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో యాపిల్ ఈ ప్రకటన చేసింది.

ఇదీ చదవండి: అలనాటి బ్రాండ్లకు మొబైల్ శోభ.. యాపిల్ సంస్ధ వినూత్న తయారీ.. వామ్మో ధర ఎంతంటే?

Exit mobile version