Site icon Prime9

Trump: అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చెయ్యాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

2020-election-was-the-biggest-fraud-donald-trump

2020-election-was-the-biggest-fraud-donald-trump

Trump: అమెరికా 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై పలు మార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని నెట్టింట ప్రస్తావించారు. ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అన్న ట్రంప్‌.. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.

2020 ఎన్నికల సమయంలో జోబైడెన్ టీంతో ట్విట్టర్‌ మాజీ టీం సంభాషణలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రంప్‌ స్పందించారు. డెమోక్రాట్లతో కలిసి తనకు వ్యతిరేకంగా టెక్‌ కంపెనీలు కుట్ర పన్నాయని ట్రంప్‌ ఆరోపించారు. ‘మా గొప్ప వ్యవస్థాపకులు తప్పడు, మోసపూరిత ఎన్నికలను కోరుకోలేదు. అలాంటి వాటిని క్షమించరు’ అంటూ పోస్ట్‌ చేశారు.

ట్రంప్‌ ప్రకటనను వైట్‌హౌస్‌ ఖండించింది. గెలిచినప్పుడే అమెరికాను ప్రేమించలేమని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి ఆండ్రూబేట్స్‌ అన్నారు. రాజ్యాంగం పవిత్రమైందన్న ఆయన.. ‘ట్రంప్ రాజ్యాంగానికి శత్రువు’  అంటూ విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: ఎస్ఎంఎస్ కు 30 ఏళ్లు.. మొట్టమొదటి ఎస్ఎంస్ ఏమని పంపారో తెలుసా..?

Exit mobile version