Hydralakes Free Mobile App was Introduced in Hyderabad: హైదరాబాద్ నగరంలో లేక్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై శాశ్వత చర్యలు చేపడుతోంది. అయితే, ఇటీవల చాలా కుటుంబాలు బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇంటి నిర్మాణానికి ఖర్చు పెట్టగా.. చివరికి ఆ ఇంటి నిర్మాణాలు లేక్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రాలేక్స్’ పేరిట ఉచిత మొబైల్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస సమయంలో ఎఫ్‌టీఎల్ పరిధితో పాటు లేక్ బఫర్ జోన్ నిబంధనలు ఒకసారి పూర్తిగా తనిఖీ చేస్తే ఇతర సమస్యలు ఉండవని హైడ్రాలేక్స్ యాప్ డెవలప్‌మెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా వివరాలు తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఈ యాప్ ద్వారా క్షణాల్లో ఫోన్‌లోనే వివరాలను రాబట్టవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా తమకు కావాల్సిన ఆస్తి కొనుగులు వివరాలను పొందే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, లేక్ బఫర్ జోన్ నిర్మాణాలపై హైడ్రా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ బఫర్ జోన్ పరిధి కిందకు వస్తే తూచ తప్పకుండా ఆ నిర్మాణాలను తొలగిస్తుంది. గతంలో నిబంధనలు తెలియక ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం ఫోన్‌లోనే లేక్ బఫర్ జోన్ నిబంధనలు తెలుసుకునేలా యాప్ తీసుకొచ్చారు. దీంతో పలు సమస్యలకు చెక్ పడింది.
బఫర్ జోన్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే.. ఆ నిర్మాణాలను పూర్తిగా తొలగించనున్నారు. అలాగే ఎఫ్‌టీఎల్ మార్జిన్లను దాటిన సమక్షంలో నీటికి అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆస్తిని సైతం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నిర్మాణాలను తొలగిస్తే.. సంబంధిత వాటికి నష్టపరిహారం అందదు.
ఈ యాప్ ద్వారా సంబంధిత స్థలం లేదా ఆ ప్రాంతంలో ఉన్న స్థలానికి సమీపంలో లేక్ ఎంత దూరముందో కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆ స్థలం బఫర్ జోన్ పరిధిలోకి వస్తోందో లేదో గుర్తించవచ్చు. ఎఫ్‌టీఎల్ లిమిట్లు సైతం యాప్‌లో చూసేందుకు వెసులుబాటు ఉంటుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధితో పాటు గ్రేటర్ హైదరబాద్ ముట్టడి ప్రాంతాల్లోనూ పనిచేచనుంది.
అయితే ఈ యాప్ ప్రధానంగా ప్లాట్ తొలిసారి కొనుకునేవారికి ఉపయోగపడుతోంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డెవలపర్లతో పాటు కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసే వారికి, భవిష్యత్తులో పెట్టుబడి పెట్టే ఔత్సాహికులకు ఉపయోగపడనుంది. ఈ యాప్‌ను ios యూజర్లు.. https://apps.apple.com/us/app/hydralakes/id లేదా ఆండ్రాయిడ్ యూజర్లు https://play.google.com/store/apps/detailsకు వెళ్లి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కావున ప్రాపర్టీని కొనుగోలు చేసుకునే ముందే బఫర్ జోన్‌లో ఉందో లేదో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.